News March 23, 2024
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామ శివారులోని మహి గ్రానైట్ పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరిశ్రమలో విధులు ముగించుకొని వెళ్తున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన యువకుడు అమిత్ కుమార్ సింగ్(32) అనే కార్మికుడిని బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 8, 2025
మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
News September 7, 2025
మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.
News September 7, 2025
మెదక్: రేపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం

మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురణ, సంబంధించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశానికి సకాలంలో తప్పక హాజరుకావాలని సూచించారు.