News March 11, 2025
సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి: కడప ఎస్పీ

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, న్యాయం చేయాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.
News March 5, 2026

కడప: ఇంటర్ పరీక్ష.. ఇవాళ ఎంతమంది రాశారంటే.!

కడప జిల్లాలో గురువారం 62 కేంద్రాల్లో ఇంటర్ 1st ఇయర్ జువాలజీ, గణితం పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. నేటి పరీక్షలకు 6,561 మందికి గాను.. 6,029 మంది (92%) హాజరయ్యారు. 532 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,208 మందికి గాను.. 4,834 మంది పరీక్షలు రాశారు. 374 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,353 మందికి గాను.. 1,195 మంది పరీక్షలు రాశారు.