News March 11, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

image

హైడ్రా సోమవారం ప్ర‌జావాణిని నిర్వ‌హించింది. ప్ర‌జావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత‌ లేఔట్లు, ర‌హ‌దారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాల‌ని ప‌లువురు వినతులు అందజేశారు. మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌బ్జా చేస్తున్నార‌ని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పంద‌న లేద‌ని ప‌లువురు వాపోయారు.

Similar News

News March 11, 2025

HYDలో బయటకు వెళ్లాలంటే.. గొడుగు పట్టాల్సిందే!

image

గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.

News March 11, 2025

కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైతుంది: కేటీఆర్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైపోతుందని కేటీఆర్ మండిపడ్డారు. సాగుకు స‌రిప‌డా నీళ్లు లేక‌, విద్యుత్ కోత‌ల‌తో అన్న‌దాత బోరున విలపిస్తున్నాడని అన్నారు. ‘చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న త‌ల్ల‌డిల్లిపోతుండు. ఏం చేయాలో దిక్కుతోచ‌క అన్న‌దాతలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు’ అని అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

News March 11, 2025

HYD: చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి నిధుల మంజూరు

image

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వర్సిటీకి రూ.300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోఠి ఉమెన్స్ కాలేజ్‌ను యూనివర్సిటీగా మార్చడంతోపాటు దానికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!