News March 11, 2025
విజయవంతంగా ముగిసిన LRS అవగాహన సెమినార్

ఖమ్మం జిల్లాలో LRSపై ఏర్పాటు చేసిన అవగాహన సెమినార్ విజయవంతంగా ముగిసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు తెలిపారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో LRSపై అవగాహన సెమినార్‌ను నిర్వహించారు. LRSపై సభ్యులు అడిగిన వివిధ సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశామని చెప్పారు. LRSకు సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచే సినట్లు జిల్లా రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
కంకర మిల్లు అక్రమాలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో ఉన్న కంకర మిల్లు యాజమాన్యం సాగిస్తున్న అక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టరేట్ ‘ప్రజావాణి’లో గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మిల్లు నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతూ పంచాయతీకి రావాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి NOC గానీ, పాలకవర్గ తీర్మానం గానీ లేకుండానే మిల్లు పనులు సాగిస్తున్నారని తెలిపారు.
News January 19, 2026
అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
News January 19, 2026
ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


