News March 11, 2025

భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News September 16, 2025

కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

image

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

News September 16, 2025

గౌరవెల్లి పెద్దగుట్టలో చిరుత కలకలం..!

image

అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారుల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జక్కుల రాజు అనే రైతు పొలం వద్దకు వెళ్తుండగా చిరుతను చూసినట్లు తెలిపాడు. పొదల్లో దాగున్న పులి గట్టిగా గర్జిస్తూ కొండెంగను చంపి పట్టుకుందన్నారు. గత వారం గుట్టపైకి వెళ్లిన లేగ దూడలను తిన్న కళేబరాలు కనిపించాయని చెప్పాడు. దాంతో పశువుల కాపరులు ఆ వైపు వెళ్లడానికి భయపడుతున్నారు.

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.