News March 11, 2025
బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రి కుర్రాడి విజయం

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రికి చెందిన అక్షయ్ విజేతగా నిలిచారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అక్షయ్ 70 విభాగంలో తన ప్రతిభ చాటి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పట్టణవాసులు పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 11, 2025
కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
News March 11, 2025
నెల్లూరు: 12మంది అడ్మిన్లకు షోకాజ్ నోటీసులు జారీ

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 12 మందికి రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్ సూర్య తేజ షోకాజ్ నోటీసులను సోమవారం జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు ఈ నెల చివరి నాటికి కరెంట్ డిమాండ్ 100%, అరియర్ డిమాండ్ 75% పూర్తి చేయాలని నిర్దేశించారని తెలిపారు.
News March 11, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఓ వైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో ఇవాళ, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం ఉందని పేర్కొంది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాలోని పలు చోట్ల వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది.