News March 11, 2025
ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.
Similar News
News November 1, 2025
నిజామాబాద్: పార్టీ పెట్టాలా? వద్దా..?

జనం బాటతో జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పెట్టేందుకు MLC కవిత బాటలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా NZB, MBNR పర్యటన తర్వాత కరీంనగర్లో ఆమె పర్యటిస్తున్నారు. మేధావులు, రైతులు, కుల సంఘాలను కలుస్తూ తానెత్తుకున్న BC నినాదంపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. ఈ పర్యటనల తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి ఆమె వచ్చే ఛాన్స్ ఉంది.
News November 1, 2025
JGTL: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీటే: SP

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్ ఓపెన్ చేయాలని SP ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, విచారణ వ్యవస్థను వేగవంతం చేయడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.
News November 1, 2025
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.


