News March 11, 2025

మార్చి 10: చరిత్రలో ఈ రోజు

image

*1689: ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మరణం
*1915: టీమిండియా మాజీ క్రికెటర్ విజయ్ హజారే జననం
*1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
*1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
*1979: తెలుగు సాహితీకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మరణం

Similar News

News March 11, 2025

ప్రణయ్ హత్య కేసులో తీర్పు.. అమృత స్పందన ఇదే..

image

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

News March 11, 2025

Xను హ్యాక్ చేసింది మేమే: Dark Storm Team

image

ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ ‘Dark Storm Team’ ప్రకటించుకుంది. ఈ సైబర్ అటాక్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తమ బలాన్ని నిరూపించుకునేందుకే చేశామని స్పష్టం చేసింది. ఈ Dark Storm Team పాలస్తీనాకు అనుకూలంగా ఉంటుంది. హై సెక్యూరిటీ సిస్టంలను కూడా సులభంగా హ్యాక్ చేస్తుందన్న గుర్తింపు ఉంది. నాటో, ఇజ్రాయెల్, దాని అనుకూల దేశాల సైట్లను టార్గెట్ చేసింది.

News March 11, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్

image

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 నెలలుగా వైద్యం అందిస్తున్నా నరాల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు తెలిపారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని, ఎవరినీ గుర్తుపట్టట్లేదని చెప్పారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్‌లో ఫుడ్ ఇస్తున్నామన్నారు. శరీర కదలిక కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని చెప్పారు.

error: Content is protected !!