News March 11, 2025
‘ది రాజాసాబ్’లో నా రోల్ అది కాదు: నిధి అగర్వాల్

ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో తాను దెయ్యం పాత్ర పోషించట్లేదని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. ఈ సినిమాలో తన రోల్ వినోదాత్మకంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు. హీరో ప్రభాస్ సెట్‌లో అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటారని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ నటిస్తున్నారు.
Similar News
News March 11, 2025
పిల్లల ఆకలి తీర్చేందుకు..!

పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుందనే విషయాన్ని లండన్‌కు చెందిన మేరీ ఆన్ బెవన్ నిరూపించారు. నలుగురు పిల్లలున్న ఆమె 1914లో భర్త చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారారు. వారి పోషణ కష్టమవగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్రోమెగలీ వ్యాధి కారణంగా ఆమె ముఖం అందవిహీనంగా మారడంతో ‘వరల్డ్ అగ్లీయెస్ట్ ఉమెన్’ పోటీలో పాల్గొన్నారు. గెలిచిన డబ్బుతో వారి ఆకలి తీర్చారు. ఆ తర్వాత సర్కస్‌లో చేరి వారి బాగోగులు చూసుకోగలిగారు.
News March 11, 2025
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పెంపు

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద SSC, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు నిరుద్యోగులకు దేశంలోని టాప్-500 కంపెనీల్లో 1yr ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెలకు ₹5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద ₹6000 ఇస్తారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి ₹8Lలోపు ఉండాలి. దరఖాస్తుకు ఇక్కడ <
News March 11, 2025
CM రేవంత్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు

TG: నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సీఎం రేవంత్‌ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాదరంగా పలకరించారు. అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. విష్ణు ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.