News March 11, 2025
KMR: అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ఛాన్స్: కలెక్టర్

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఈ నెల 31వ తేదీలోగా చేసుకుంటే 25 శాతం రాయితీ ఇస్తుందని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, లేఅవుట్ యజమానులతో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, వక్స్ బోర్డు, ఎండోమెంట్, శిఖం తదితర భూములకు ఈ అవకాశం వర్తించదని అన్నారు.
Similar News
News March 11, 2025
మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
News March 11, 2025
బీరువాలో కాగితాలు.. వాటి విలువ రూ.12 లక్షలు!

ఇంట్లోని పాత కాగితాలు అతనికి దాదాపు రూ.12 లక్షలు తెచ్చిపెట్టాయి. రతన్ అనే వ్యక్తికి తన తండ్రి 1992లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ బీరువాలో లభించాయి. ఒక్క షేర్ రూ.10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. దీని గురించి రతన్ ట్వీట్ చేయడంతో ట్రేడ్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని బోనస్‌లు కలిపి ఇప్పుడవి 960 షేర్స్ అయ్యాయని, వీటి విలువ రూ.11.88 లక్షలని చెబుతున్నారు.
News March 11, 2025
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతంగా చేయాలి: KMR కలెక్టర్

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటీలో LRS హెల్ప్ లైన్ డెస్కులను ఆయన పరిశీలించారు. ప్రతీ దరఖాస్తుదారుడికి సమాచారం అందించి, రిబేట్ గురించి తెలియజేయాలన్నారు. ప్రతిరోజూ LRSపై సమీక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.