News March 11, 2025
సంగారెడ్డి: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

8 మంది విద్యార్థులను అకారణంగా కొట్టినందుకు కంగ్టి కస్తూర్బా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గణితం సీఆర్పీ సురేఖ, పీఈటీ రేణుకను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులను కొడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 5, 2026
అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో నిన్న టీడీపీలో చేరారు. ముందుగా వేలాది మంది అనుచరులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియాజ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వైసీపీ జెండా మోసినా తనకు గుర్తింపు దక్కలేదన్నారు.
News January 5, 2026
జీ.మాడుగుల: విలువైన గంధం చెట్లు నరికివేత

జీ.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన సిరి గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసి, అపహరించుకు పోయారు. ఉర్లమెట్టకు ఆనుకొని ఉన్న కొండపై విలువైన గంధం చెట్లను కొట్టుకుని పోయారు. ఇది స్మగ్లర్ల పనేనని స్థానికులు భావిస్తున్నారు. ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదివారం కోరారు.
News January 5, 2026
శివ మానస పూజ చేద్దామా?

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


