News March 11, 2025
సంగారెడ్డి: 31 వరకు చివరి అవకాశం: కలెక్టర్

పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఈనెల 31వ తేదీ వరకు 25% రాయితీ ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్ వెరిఫికేషన్ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.
News September 16, 2025
JGTL: ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2002 ఎస్‌ఐఆర్, 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాను పోల్చి డూప్లికేట్ ఓట్లు తొలగించి క్షేత్ర స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్ మీటింగులు జరిపి ప్రతిరోజు లక్ష్యాలు నిర్దేశించాలని VCలో చెప్పారు. VCలో కలెక్టర్ బీ.సత్యప్రసాద్ సహా అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
జగిత్యాల: రేపటి నుంచి పోషణ మహోత్సవం: కలెక్టర్

చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు రేపటి నుంచి OCT 16 వరకు శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో పోషణ మహోత్సవంపై అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌష్టికాహార లోపాన్ని నివారించడం, రక్తహీనత, డయేరియా, మంచినీరు, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.