News March 11, 2025
సంగారెడ్డి జిల్లాను మర్చిపోలేను: ఎస్పీ రూపేష్

సంగారెడ్డి జిల్లాతో ఉన్నా అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోలేనని బదిలీపై వెళ్తున్నా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీగా మొదటి పోస్టింగ్ సంగారెడ్డి జిల్లా అని, జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతగానో ఉందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదనపు ఎస్పీ సంజీవ రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
జనగామ జిల్లాలో పేపర్‌లెస్ పరిపాలనకు శ్రీకారం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ-ఆఫీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనలో పారదర్శకత పెంపుతో పాటు సేవలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించారు. ఫైళ్లను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ద్వారా నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
News March 20, 2026
ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

మార్చి 21న ప్రభుత్వం రంజాన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.
News March 20, 2026
విద్యుత్ సిబ్బంది భద్రతకు ‘ఎల్సీ యాప్’ కవచం

ఖమ్మం: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.


