News March 11, 2025
రాష్ట్రస్థాయిలో సిద్దిపేట ప్రాజెక్టుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య కమిషనరేట్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జిజ్ఞాస పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, తెలుగు విభాగంలోని విద్యార్థులు ప్రదర్శించి కళాశాల విద్య కమిషనరేట్ సంయుక్త డైరెక్టర్ డా.రాజేంద్ర సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వారిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.
Similar News
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.
News October 29, 2025
నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News October 29, 2025
తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.


