News March 11, 2025
PPM: జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన

జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. హేమలత అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని, బస వేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు అవుతారని ఆమె తెలిపారు.
Similar News
News November 5, 2025
ప్రగతినగర్: చెరువా.. కాలుష్య కర్మాగారమా?

స్థానిక అంబిర్ చెరువు కాలుష్య కర్మాగారంగా దర్శనమిస్తోంది. ఎంతో పురాతనమైన ఈ చెరువు కబ్జాలకు అడ్డాగా మారింది. చెరువు చుట్టూ చెత్తాచెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోని నీరు కూడా అంతే. ఒక వైపు ఉన్న మాంసం అంగళ్ల నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను చెరువులో పడేస్తున్నారు. చెరువు పక్కగుండా వెళ్లాలంటే ముక్కలు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి చెరువును రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


