News March 11, 2025
ఐ.పోలవరం: మోసం చేసిన వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి చెందిన ముక్తేశ్వరరావుకు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారని ఎస్సై మల్లికార్జున రెడ్డి సోమవారం తెలిపారు. ముమ్మిడివరం మెజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా ఈ తీర్పు ఇచ్చారన్నారు. జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021లో అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారన్నారు.
Similar News
News January 13, 2026
ప్రతి ప్రయాణం సురక్షితం కావాలి: జగిత్యాల కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు “Arrive Alive” కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంతో ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగమే ప్రమాదాలకు కారణమన్నారు.
News January 13, 2026
జగిత్యాల: చలో ఖమ్మం సీపీఐ శతాబ్ది సభకు పిలుపు

ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ వంద ఏళ్ల వేడుకల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాలలో మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు. పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పార్టీ ప్రస్థానాన్ని చాటేలా ఈ భారీ సభ సాగుతుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
News January 13, 2026
సూర్యాపేట: ఎన్నికల సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న రెండో సాధారణ ఎన్నికల కోసం సామగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కె.సీతారామరావు తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఈనెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9885627131 నంబరును సంప్రదించాలని సూచించారు.


