News March 11, 2025
ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.
Similar News
News March 12, 2025
గ్రూప్-2లో ర్యాంక్ సాధించిన మహబూబాబాద్ SI

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ గ్రూప్-2 ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో యువకులు సత్తా చాటారు. పట్టణంలో టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న శివకుమార్ స్టేట్ వైడ్ 25వ ర్యాంకు సాధించి మహబూబాబాద్‌లో టాప్‌గా నిలిచారు. ఓవైపు ఎస్ఐగా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలకు చదివి టాప్ ర్యాంక్ సాధించడంతో జిల్లాలోని పలువురు ఎస్సై శివకుమార్‌ను అభినందిస్తున్నారు.
News March 12, 2025
సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News March 12, 2025
అల్లూరి జిల్లాలో YSRకు చెప్పుల దండ

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, గాజులు, మద్యం సీసాలను కట్టారు. ఇది గమనించిన స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పార్టీ కోశాధికారి కుందెరి రామకృష్ణ విగ్రహానికి ఉన్న చెప్పులను, గాజులు తొలగించారు. YSRని అవమానించడం దారుణమని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.