News March 11, 2025

నిర్మల్‌ జిల్లాలో పలువురు CIల బదిలీలు

image

నిర్మల్ జిల్లాలో పలువురు CIలను రాష్ట్ర పోలీసు అధికారులు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. డీసీఆర్‌బీలో CIగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్‌ను డీఎస్‌బీకి బదిలీ చేశారు. సీసీఎస్ విభాగంలో CIగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను నిర్మల్ రూరల్ CIగా, హైదరాబాద్‌లో వెయిటింగ్ లిస్టులో ఉన్న సమ్మయ్యను డీసీఆర్‌బీ నిర్మల్‌కు బదిలీ చేశారు.

Similar News

News November 9, 2025

జూబ్లీ బైపోల్‌లో ఓటుకు రూ.2,500- రూ.5వేలు!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా.5 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో చివరి రోజు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు, ఓటుకు రూ.2500- రూ.5వేల వరకు పంపిణీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం కట్టడి చర్యలు చేపట్టింది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నేటి సా.6 గం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి.

News November 9, 2025

రాష్ట్ర విజేతగా ఆదిలాబాద్ జిల్లా జట్టు

image

నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ హ్యాండ్ బాల్ అండర్ 17 బాలికల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందని డీఈవో రాజేశ్వర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్ తెలిపారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు మహబూబ్ నగర్ జిల్లా జట్టుపై 17-7 తేడాతో ఘన విజయం సాధించిందన్నారు. విజేత జట్టుకు పలువురు అభినందనలు తెలిపారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

image

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.