News March 11, 2025

గుంటూరులో వ్యక్తి కిడ్నాప్

image

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి అతడిపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.

Similar News

News March 12, 2025

ఐ.పోలవరం: 20 ఏళ్లు కూడా లేవు.. అంతలేనే ఇలా..! 

image

ఇద్దరికి 20 ఏళ్లు కూడా లేవు. అంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారిధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు తాళ్లలేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన వీరేంద్ర (17), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 12, 2025

ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

News March 12, 2025

విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

image

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!