News March 11, 2025

గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్న కేసీఆర్

image

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !

Similar News

News October 25, 2025

రంప: ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

image

విద్యార్థులు మానసిక, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆశ్రమ ఉన్నత పాఠాశాలల హెచ్‌ఎంకు సూచించారు. శనివారం జడ్డంగి, తాళ్ళపాలెం (రాజవొమ్మంగి) గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను చూశారు. విద్యార్థినీ, విద్యార్థులుతో మాట్లాడారు. హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ఉన్నారు

News October 25, 2025

ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్‌ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.

News October 25, 2025

జనగామ నుంచి పంచారామాలకు ఆర్టీసీ బస్సులు

image

జనగామ డిపో నుంచి కార్తీక మాసం టూర్ ప్యాకేజీలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని యాత్రీకులు సద్వినియోగం చేసుకునాలని ఆమె కోరారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి ఆదివారం పంచారామాలకు జనగామ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయని వివరాలకు 9701662166, 7382852923 నంబర్లకు సంప్రదించాలని కోరారు.