News March 11, 2025
బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ

ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సెషన్స్ సాగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో పాల్గొన్న మహబూబ్‌నగర్ ఎంపీ మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News March 12, 2025
ఐ.పోలవరం: 20 ఏళ్లు కూడా లేవు.. అంతలేనే ఇలా..!

ఇద్దరికి 20 ఏళ్లు కూడా లేవు. అంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారిధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు తాళ్లలేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన వీరేంద్ర (17), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 12, 2025
ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
News March 12, 2025
విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.