News March 11, 2025

బోరుగడ్డకు బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

image

సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ ఇవ్వొద్దని నాలుగో పట్టణ పోలీసులు అనంతపురం ఎక్సైజ్ కోర్టుకు విన్నవించారు. తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై హైకోర్టులో తేలేవరకు విచారణను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు న్యాయాధికారి తెలిపారు.

Similar News

News March 12, 2025

సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

image

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.

News March 12, 2025

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు 

image

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.

News March 12, 2025

NRPT: తెలంగాణ బడ్జెట్.. జిల్లాకు ఏమి కావాలంటే.?

image

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో NRPT జిల్లాకు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 69జీవోను పాత డీపీఆర్ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు, వాగులపై చెక్ డ్యాముల నిర్మాణం, కొత్తగా బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నారు.

error: Content is protected !!