News March 11, 2025
దండేపల్లి: భర్త చనిపోయి 4 ఏళ్లు.. అయినా పెన్షన్ రాలేదు

తన భర్త మరణించి నాలుగు సంవత్సరాలు పూర్తయినా పెన్షన్ రావడంలేదని జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన చింతగుంట్ల పోశవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేసుకొని బతుకుతున్న తనకు భర్త చనిపోవడంతో బతుకుభారంగా మారిందన్నారు. కనీసం పెన్షన్ అయిన వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తే 4 ఏళ్లు గడిచినా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
Similar News
News January 20, 2026
HYD: మల్లారెడ్డి కాలేజీలో గంజాయి కలకలం

మల్లారెడ్డి కాలేజ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఒకటిన్నర లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా, నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ నుంచి ఒడిశాకు వెళ్లి గంజాయి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు.
News January 20, 2026
చిత్తూరు: నత్త నడకన పన్ను వసూళ్లు

చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూలు నత్తనడకన కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 శాతం కూడా పన్ను వసూలు కాలేదు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.14 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అలాగే పుంగనూరులో రూ.6 కోట్లకు రూ.3.52 కోట్లు, నగరిలో రూ.4.98 కోట్లకు రూ.2.17 కోట్లు మాత్రమే వసూలు అయినట్టు అధికారులు చెప్పారు.
News January 20, 2026
BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్‌లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!


