News March 11, 2025
భూపాలపల్లి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

భూపాలపల్లి జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
Similar News
News November 9, 2025
షీలా నగర్ జంక్షన్లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలా నగర్ జంక్షన్లో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాల సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు.
News November 9, 2025
HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.
News November 9, 2025
HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సలు మరిచిపోలేరు.


