News March 11, 2025
గద్వాల: చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం: మంత్రి

చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ తెలంగాన సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
శాసనమండలిలో వైసీపీ నిరసన

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.
News March 12, 2025
సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.
News March 12, 2025
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో మార్పులు

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.