News March 11, 2025

నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

image

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.

Similar News

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2026

పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

image

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.

News January 14, 2026

వేరుశనగలో దిగుబడి పెరగాలంటే!

image

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.