News March 11, 2025

తిరుమల: 13 కంపార్టుమెంట్లలో భక్తులు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకోగా, 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Similar News

News March 12, 2025

పాపం ‘పాప’

image

AP: కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిపై రాజమండ్రి 3టౌన్ PSలో పోక్సో కేసు నమోదైంది. 8వ తరగతి చదువుతున్న బాలిక(15) మంగళవారం డల్‌గా ఉండటంతో టీచర్ ఓదార్చుతూ ఏమైందని అడిగారు. దీంతో తండ్రి రాక్షసకాండను ఆమె బయటపెట్టారు. కాగా, విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కుమార్తెలతో 8ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. 3ఏళ్లుగా పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం జరిగింది.

News March 12, 2025

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.

News March 12, 2025

నా ఒక్క‌డితో మొద‌లై శ‌క్తిమంతంగా ఎదిగింది: YS జగన్

image

AP: YSR ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన YCPని భుజాలపై మోస్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులకు YS జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘నా ఒక్క‌డితో మొద‌లైన YCP శ‌క్తిమంతమైన పార్టీగా 15వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్ర‌జ‌ల‌తోనే ఉంది. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచి, దేశంలోనే రాష్ట్రాన్ని నంబ‌ర్-1గా నిల‌ప‌డ‌మే ల‌క్ష్యం’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!