News March 11, 2025

గోలేటి ఏరియా స్టోర్‌లో చోరీ.. నలుగురు అరెస్ట్

image

గోలేటి ఏరియా స్పోర్ట్ చోరికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తాండూర్ CI కుమారస్వామి తెలిపారు. మందమర్రికి చెందిన మోతే రాజయ్య, నరసయ్య, తిరుపతి, మధు జనవరి 8న గోలేటి ఏరియా వర్క్ షాప్‌లోని సింగరేణి అధికారులు నిల్వ ఉంచిన పరికరాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ 6.22లక్షలు ఉంటుందన్నారు.

Similar News

News March 28, 2026

TU: రీవాల్యూయేషన్‌కు అప్లై చేసుకున్నారా..!

image

తెలంగాణ వర్సిటీ పరిధిలోని B.Ed, B.P.Ed 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎగ్జామ్ కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 4 లోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యాలు ఆ దరఖాస్తులను ఏప్రిల్ 7 లోగా వర్సిటీలో సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News March 28, 2026

పాలమూరు: వేడి గంజిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

image

NRPT జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సుధాబాయి, నరసింహులు దంపతుల కుమార్తె నందిని (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకొన్నాయి.

News March 28, 2026

విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం..!

image

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి (GGH) సాక్షిగా దారుణం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతి తన తండ్రి చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, అక్కడ పరిచయమైన అమీన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను నమ్మించి కృష్ణలంకకు తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో, వారు మాచవరం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.