News March 11, 2025
అవనిగడ్డ సబ్ ట్రెజరీలో అవినీతి..ఇద్దరిపై సస్పెన్షన్

అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వెలుగు చూసింది. ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు మళ్లించినట్లు గుర్తించి సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అలాగే, అవినీతిని గుర్తించలేకపోయిన ఎస్‌టిఓ ఆదిశేషుపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.
Similar News
News November 6, 2025
కృష్ణా: మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులు వీరే.!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎస్. వాగ్దేవి (8వ తరగతి), పెడన- పి. చాందిని 10th, ఉయ్యూరు-ఉప్పాల అక్షయ 10th, గుడివాడ-వి.అక్షిత 10th, గన్నవరం-పి.చరిత 10th, పామర్రు-పాముల హిమబిందు 10th, అవనిగడ్డ-హిమాంజలి 9th. ఎంపికయ్యారు.
News November 6, 2025
కృష్ణా: పంచారామాల బస్సులకు.. ఆన్‌లైన్ రిజర్వేషన్

పంచారామాలు, అరుణాచలం, విశిష్ఠ శైవ క్షేత్రాలు, అలాగే యాగంటి, మహానంది, శ్రీశైలం త్రిలింగ దర్శినికి RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నవంబర్ 8,9 తేదీల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి శని, ఆదివారం రాత్రి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయని RTC అధికారులు తెలిపారు. ప్రయాణికులు ONLINEలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చుని సూచించారు.
News November 6, 2025
కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.


