News March 11, 2025
బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లో మల్యాల జట్టు విజయం

జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో సోమవారం బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్కు వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో మల్యాల మండలం జట్టు ఫైనల్లో విజయం సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.
Similar News
News March 16, 2026
పెద్దపల్లి: హెచ్‌టీ సర్వీసులకు సింగిల్ విండో విధానం

హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుందని PDPL సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 542 సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. దరఖాస్తులను TGNPDCL పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పారదర్శకత పెరిగిందన్నారు.
News March 16, 2026
అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
News March 16, 2026
జూన్ నెల శ్రీవారి దర్శన కోటా టికెట్ల వివరాలు

☛ ఈ నెల 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
☛ 21న శ్రీవారి ఆర్జిత సేవా, వర్చువల్ ఆర్జిత సేవా టోకెన్ల విడుదల
☛ 23న 10AMకి అంగప్రదక్షిణం ఫ్రీ టికెట్స్, 11AMకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఆన్‌లైన్ కోటా, 3PMకి సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా
☛ 24న 10AMకి స్పెషల్ ఎంట్రీ (₹300) దర్శనం టికెట్లు, 3 PM నుంచి గదుల కోటా


