News March 11, 2025

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి సంధ్యారాణి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండుమూడు నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత TDPతోనే ప్రారంభమైందని వివరించారు.

Similar News

News March 12, 2025

స్టార్‌లింక్ ఇంటర్నెట్: నిన్న ఎయిర్‌టెల్ నేడు జియో

image

భారత టెలికం పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. స్టార్‌లింక్ ఒప్పందంపై <<15725079>>ఎయిర్‌టెల్<<>> ప్రకటన విడుదల చేసిన మరునాడే జియో ఇలా చేయడం గమనార్హం. తమ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ పరికరాలు విక్రయిస్తామని, యాక్టివేషన్, ఇన్‌స్టలేషన్ సేవలు అందిస్తామని తెలిపింది.

News March 12, 2025

సౌందర్య మృతి.. మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు

image

అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శంషాబాద్‌లోని జల్‌పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది. ఇదే హత్యకు దారి తీసింది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్‌బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.

News March 12, 2025

శాసనమండలిలో వైసీపీ నిరసన

image

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.

error: Content is protected !!