News March 11, 2025
JNTU: ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరణ

JNTU పరిధిలో 2025-26కు సంబంధించి అఫిలియేషన్ కాలేజీ పునరుద్ధరణలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కళాశాల నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యూనివర్సిటీ సంబంధిత అధికారులను సంప్రదించి వారి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.
News November 10, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,900, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17వేలు పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,800, దీపిక మిర్చి రూ.14వేలు, టమాటా మిర్చి రూ.30వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు. 2043 రకం మిర్చికి రూ.22వేలు, 5531 రకం మిర్చికి రూ.15వేల ధర వచ్చింది.


