News March 11, 2025

మందమర్రి: మహిళపై గొడ్డలితో దాడి

image

మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అంగడిబజార్‌ ప్రాంతంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కందుల కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంచినీళ్ల విషయంలో పగిడి రాంబాయి అనే మహిళతో గొడవపడ్డాడు. అనంతరం ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో దాడి చేయగా రాంబాయి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 18, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 18, 2026

అనంతపురం జిల్లాలో వర్షాలు.. పిడుగు

image

గుమ్మగట్ట, రాయదుర్గం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గుమ్మగట్ట మండలం గోనబావిలోని బీసీ కాలనీలో మారెన్న ఇంటి దగ్గర కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో రెండు కొబ్బరి చెట్లు కాలిపోయాయి. భారీ ఉరుములు మెరుపులతో పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాయదుర్గంలో గంటకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News March 18, 2026

ఇదేంటి భయ్యా.. రోజూ రేట్ పెంచుతున్నారు?

image

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న, జాబ్ చేస్తూ రూముల్లో ఉంటున్న బ్యాచిలర్లు అంటున్న మాటలివి. LPG కొరతతో పలు హోటళ్లు క్లోజింగ్ బోర్డులు పెట్టగా.. మరికొన్ని టిఫిన్లు, కర్రీలపై 2-3 రోజులకు రూ.5 పెరుగుతోందని వాపోతున్నారు. గ్యాస్ కొరత నిజమే అయినా రోజూ దాన్ని సాకుగా చూపుతూ ధరలు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10 రోజుల్లో వీటిపై రూ.15 వరకు పెంచినట్లు చెబుతున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది?