News March 11, 2025
సూర్యాపేట: ‘పరువు హత్యలు ఇకనైనా ఆగాలి!’

2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రణయ్ హత్య తర్వాత జరగిన పరువు హత్యలు చర్చకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని భువనగిరిలో రామకృష్ణను, ఇటీవలే సూర్యాపేటలో మాల బంటిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 10, 2025
కరీంనగర్: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చికిత్స పొందుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గత రాత్రి సుల్తానాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీ కొనగా.. 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదని, ఎవరైనా గుర్తుపడితే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
News November 10, 2025
ములుగు: ఎలుకల మందు తాగి మహిళ సూసైడ్

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త అటికే పరమేష్ రూ.3 వేల ఆన్‌లైన్ షాపింగ్ చేయగా, భార్య దివ్య అతడిని మందలించింది. అనంతరం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా దివ్య ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News November 10, 2025
అరకు చలి ఉత్సవాలను జయప్రదం చేయండి: కలెక్టర్

2026 సంవత్సరానికి గాను అరకు చలి ఉత్సవాలను జనవరి 3,4 తేదీల్లో ఉండవచ్చని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఉత్సవాలను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా చలి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చలి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు కీలక కార్యకలాపాలను అప్పగించారు.


