News March 11, 2025

భీమవరంలో క్రికెట్ బెట్టింగ్.. అమలాపురం వాసి అరెస్ట్

image

ఆన్‌లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అమలాపురం వాసితోపాటు మరో ముగ్గురిని ప.గో.జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భీమవరంలో డీఎస్పీ జయసూర్య వివరాలు తెలిపారు. అమలాపురం(M) కొత్తపాలేనికి చెందిన నాగసాయి, భీమవరానికి చెందిన తవిటినాయుడు, నానాజీ నుంచి రూ.13లక్షల విలువైన 54ఫోన్స్, 3ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు డిగ్రీ, డిప్లొమో చదివిన 25ఏళ్లలోపు వారే.

Similar News

News March 16, 2026

సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.

తూ.గో: మహిళపై సామూహిక అత్యాచారం.. నలుగురికి యావజ్జీవ శిక్ష

image

కడియపులంకలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులకు రాజమండ్రి జిల్లా కోర్టు సోమవారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. 2024 అక్టోబర్ 14న పని నుంచి వస్తున్న ఆమెను అడ్డగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కడియం పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.