News March 11, 2025

WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.

Similar News

News March 16, 2026

దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా మోదీ చర్యలు: చంద్రబాబు

image

AP: యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా PM మోదీ చర్యలు చేపడుతున్నారు. కష్టకాలంలో కుంగిపోకుండా సమష్టిగా పనిచేయాలి. అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను గుర్తు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’ అని అమరావతిలో అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

News March 16, 2026

తిరుమల శ్రీవారికి నూతన పరదాల సమర్పణ

image

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారికి నూతన పరదాలను సమర్పించారు. బంగారు వాకిలి వద్ద ఉపయోగించే ఈ పరదాలపై నేత్ర దర్శనం, పూర్ణకుంభం, శంఖు–చక్రాలు, తిరునామం, గోమాత, గజవాహనం, మామిడి తోరణాలు, అరటి గెలలు వంటి శుభ చిహ్నాలను ముద్రించారు. ఉగాది సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. పరదాల మణి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆలయ అధికారులకు అందజేశారు.

News March 16, 2026

రైతులకు ఉచితంగా యూరియా!

image

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.