News March 11, 2025
శ్రీరాంపూర్‌లో యువతి సూసైడ్

శ్రీరాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీ నగర్‌కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News March 19, 2026
మంత్రి పదవి నాకు కొత్త కాదు: గంటా

మంత్రి పదవి తనకు కొత్త కాదని, గతంలోనూ ఆ బాధ్యతలు నిర్వహించానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం సంపత్ వినాయక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. మంత్రివర్గ విస్తరణ వార్తలపై స్పందించారు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలో సీఎం చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉంటుందని, సరైన సమయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని గంటా స్పష్టం చేశారు.
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.
News March 19, 2026
రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.


