News March 11, 2025

R5 జోన్‌ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

image

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.

Similar News

News March 12, 2025

జోరుగా ‘హలాల్ మటన్’ వ్యతిరేక ఉద్యమం!

image

మహారాష్ట్రలో హలాల్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. మంత్రి నితేశ్ రాణె స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తుండటం, NDA నేతలు మద్దతిస్తుండటం గమనార్హం. హలాల్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్‌ను తీసుకొచ్చారు. హిందూ పద్ధతుల్లో మేకలు, గొర్రెలు, కోళ్లను కోసే ఝట్కా పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ ద్వారా ఈ మాంసం షాపులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్, MVA దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

News March 12, 2025

RECORD: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య

image

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్‌తో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్ చేయగా 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సాధించింది. గతంలో కోహ్లీ పెట్టిన ఓ పోస్టుకు 7నిమిషాల్లో మిలియన్ లైకులు రాగా, తాజాగా హార్దిక్ ఫొటో దాన్ని దాటేసింది. CT గెలిచిన తర్వాత కప్‌ను పిచ్‌పై ఉంచి కాబీ‌లేమ్ స్టైల్లో దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.

News March 12, 2025

ఈనెల 19న తెలంగాణ బడ్జెట్

image

TG: ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

error: Content is protected !!