News March 11, 2025
క్యూట్.. Pic Of The Day

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
అరటి ఎగుమతిపై ప్రత్యేక చర్యలు

జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధి, అరటి ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ తెలిపారు. అమరావతి నుంచి జరిగిన జూమ్ కాన్ఫరెన్స్‌లో రైలు మార్గం ద్వారా అరటి ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు. రవాణా ఖర్చులు తగ్గించడం, లాజిస్టిక్స్ మద్దతు పెంపు, రైతులకు లబ్ధి చేకూర్చే అంశాలపై చర్చ జరిగింది. రైళ్లను నిరంతరం నడిపి అరటి ఎగుమతులు సకాలంలో జరగాలన్నారు.
News January 13, 2026
అనంతపురం ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెండ్

అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దాడి ఘటనలో ఎస్పీ జగదీశ్ చర్యలు తీసుకున్నారు. ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు దాడికి సంబంధించిన వీడియోలను అందజేశారు. ఈ ఘటనలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గన్‌మెన్ షేక్షావలి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 13, 2026
అనంతపురం కొత్త జాయింట్ కలెక్టర్ నేపథ్యం ఇదే!

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన 2019 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇప్పటి వరకు నరసాపురం సబ్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత జేసీ శివ నారాయణ్ శర్మ అన్నమయ్య జేసీగా బదిలీ అయ్యారు.


