News March 11, 2025

ఏలూరు: కానిస్టేబుల్‌ ఒంటిపై 9 చోట్ల కత్తి గాయాలు

image

సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఐడి పార్టీ కానిస్టేబుల్‌‌గా పని చేస్తున్న నరేశ్‌పై అంతర్ రాష్ట్ర దొంగగా గుర్తించబడిన సురేందర్ కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సురేందర్ ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. అటు నరేశ్ శరీరంపై మొత్తం 9 చోట్ల కత్తితో చేసిన గాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 8, 2026

భద్రకాళి ఆలయంలో వైభవంగా విశేష పూజలు

image

వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి భక్తుల కోలాహలం నెలకొంది. అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, పంచామృతాలతో అభిషేకించి, నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. సెలవు రోజు కావడంతో నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News March 8, 2026

రక్త పరీక్షలు.. ఎందుకు చేయించుకోవాలి?

image

* CBC(కంప్లీట్ బ్లడ్ కౌంట్): ఎర్ర, తెల్ల రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్, అనీమియా, లుకేమియా, ఇన్ఫెక్షన్ల గుర్తింపు
* లిపిడ్ ప్రొఫైల్: కొలెస్ట్రాల్& గుండె వ్యాధుల రిస్క్‌
* బ్లడ్ షుగర్(ఫాస్టింగ్&HbA1c): డయాబెటిస్ అంచనా
* థైరాయిడ్ ప్రొఫైల్(TSH, T3, T4): హార్మోనల్ సమస్యలు
* LFT, KFT: లివర్, కిడ్నీ హెల్త్ చెక్
* విటమిన్ D&B12: ఎనర్జీ, ఇమ్యూనిటీ, బోన్స్ హెల్త్
* CRP/ESR: ఇన్ఫెక్షన్ల గుర్తింపు
#ShareIt

News March 8, 2026

వరంగల్ కోర్టుల్లో 21,672 కేసులు పెండింగ్

image

వరంగల్ జిల్లా కోర్టుల్లో కేసుల భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. 2024 ఫిబ్రవరి నెల గణాంకాల ప్రకారం జిల్లా పరిధిలో మొత్తం 21,672 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే నెలలో 175 సివిల్ కేసులు, 273 క్రిమినల్ కేసులు కొత్తగా నమోదు కాగా, 250 సివిల్, 118 క్రిమినల్ కేసులు మాత్రమే పరిష్కరించారు. కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని సమాచారం.