News March 11, 2025

MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

image

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News September 16, 2025

గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

image

డోన్‌ రైల్వే స్టేషన్‌‌లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

WNP: ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

టీజీఎస్ ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సులను బుక్ చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.

News September 16, 2025

హుస్నాబాద్: రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రజక వృత్తిదారుల సమస్యలు CM దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రజక అభివృద్ధి దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుల వృత్తులపై ఆధారపడే బలహీన వర్గాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.