News March 23, 2024
మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.
Similar News
News December 31, 2025
ప్రకాశం పుష్కలం.!

ప్రకాశం జిల్లాను ప్రకటించడంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులేసిందనే చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం విడిపోగానే, ఆ స్థానాన్ని అద్దంకి, కందుకూరు డివిజన్లతో భర్తీ చేసింది. బాపట్ల జిల్లాలోని అద్దంకిని, నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లను ప్రకాశంలోకి కలపడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు ప్రజలకు నెల్లూరు 102 కి.మీ దూరం ఉండగా, ఒంగోలు 43 కి.మీ దూరంలోనే ఉంది.
News December 31, 2025
మార్కాపురం జిల్లా.. పెను సవాళ్లు ఇవేనా?

ఎట్టకేలకు మార్కాపురం జిల్లాగా ప్రకటించబడింది. 40 ఏళ్ల కల నెరవేరింది. కానీ మున్ముందు పెను సవాళ్లు కొత్త జిల్లాకు ఎదురుకానున్నాయని చర్చ సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగానికి సరిపడ భవనాల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నిధులను వెచ్చించి వాటిని నిర్మించాల్సి ఉంది. పారిశ్రామికంగా జిల్లాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలు మాత్రం ఉందిలే మంచి కాలం ముందుముందున అంటున్నారు.
News December 31, 2025
మార్కాపురం జిల్లాకు సిబ్బంది కేటాయింపు

మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తూ ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ అడ్మిన్ సెక్షన్ – 2, సూపరింటెండెంట్ మెజిస్ట్రేరియల్ సెక్షన్1, సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ 2, సూపరింటెండెంట్ ల్యాండ్స్ 1 సెక్షన్-2, ల్యాండ్స్ 2 సెక్షన్ 1, పీజీఆర్ఎస్ 4, డ్రైవర్స్ 3, ఆఫీస్ సబార్డినేట్స్- 5 మందిని కేటాయించారు.


