News March 11, 2025

MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

image

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 5, 2026

ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

image

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

News March 5, 2026

అనకాపల్లి: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 6,557 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,096 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.