News March 11, 2025
ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

విశాఖలోని మేఘాలయ హోటల్లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 12, 2025
విశాఖ: అమ్మతో పేగు బంధం.. భగవంతుడితో అనుబంధం..!

జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్‌పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.
News March 12, 2025
విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.