News March 11, 2025
MHBD: జాబ్ మేళా సద్వినియోగపర్చుకోండి: రజిత

MHBD జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12న వైఎస్‌కే ఇన్ఫోటెక్ రంగారెడ్డి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18-28 ఏళ్లు నిండి ఉండి పదవ తరగతి విద్యార్హతతో ఆసక్తి కలిగిన స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని రజిత పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.
News September 19, 2025
GWL: ‘రేవులపల్లిలో బ్రిడ్జి నిర్మించాలి’

రేవులపల్లి-నందిమల్ల మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి పరిసర గ్రామాల ప్రజలు కోరారు. కాంగ్రెస్ గద్వాల ఇన్‌ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 28న జూరాల సందర్శన సమయంలో బ్రిడ్జిని ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మీరు ప్రతిపాదించారని, ఇప్పుడు బ్రిడ్జిని మరోచోట నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని ఆయనకు వివరించారు.
News September 19, 2025
నిర్మల్: క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ దీపక్ జాన్, కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో కలెక్టరేట్‌లో కార్యాలయంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన క్రైస్తవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా వారు అభివృద్ధి సాధించవచ్చన్నారు.