News March 11, 2025

MHBD: ఈనెల 14 నుంచి వ్యవసాయ మార్కెట్ బంద్

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో మిర్చి పంట పోటెత్తినట్లు తెలిపారు. సుమారు 20 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని, రైతులు మిర్చి పంటను విక్రయానికి తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 17 నుంచి మార్కెట్లో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News January 13, 2026

పసుపును ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.

News January 13, 2026

సంక్రాంతి: ముగ్గులు వేస్తున్నారా?

image

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

News January 13, 2026

తగ్గిన బాస్మతీ రైస్ ధరలు.. కారణమిదే

image

ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం మన బాస్మతీ బియ్యంపై పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం, షిప్‌మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.