News March 11, 2025
వరంగల్: మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలు(బిల్టీ) ధర నిన్నటితో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. నేడు రూ.2,310కి చేరింది. అయితే పల్లికాయ ధరలు తగ్గాయి. నిన్న సూక పల్లికాయకి రూ.7,160 ధర రాగా.. నేడు రూ.7,150కి చేరింది. అలాగే పచ్చి పల్లికాయకి సోమవారం రూ.4,800 ధర రాగా.. నేడు రూ.4,500కి పడిపోయింది. ఈరోజు మార్కెట్‌కి పసుపు రాలేదు.
Similar News
News March 3, 2026
ఖమ్మం: కొత్త ‘సార్’.. సప‘రేట్లు’

ఖమ్మం RTAలో గతంలో ACB దాడులతో స్తబ్దుగా ఉన్న దళారుల దందా, ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఓ అధికారి రాకతో పుంజుకుంది. ఆ అధికారి కార్యాలయ ఆవరణలోనే ఏజెంట్లతో పనుల వారీగా ‘కొత్త రేట్లు’ ఖరారు చేసినట్లు సమాచారం. పేమెంట్ కోడ్ ఉన్న ఫైళ్లను మాత్రమే ముందుకు కదపాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో సీసీ పరిశీలిస్తే ఈ వసూళ్లు బయటపడే అవకాశం ఉందని, ఉన్నతాధికారులు విచారించాలని వాహనదారులు కోరారు.
News March 3, 2026
విశాఖ: బర్త్‌డే.. డెత్ డే

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.
News March 3, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.


