News March 11, 2025
KMM: ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

వైరా మండలం పుణ్యపురం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రూ.5 కోట్ల 35 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పూజ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2026
‘పది’ పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.
News March 5, 2026
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ‘L3’ చిక్కులు.. లబ్ధిదారుల ఆవేదన

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో ‘L3’ (అనర్హులు) జాబితాలో ఉన్నవారిని కమిటీ సభ్యులు ‘L1’గా గుర్తించి ఇళ్లు మంజూరు చేయడంతో సమస్య మొదలైంది. అధికారుల హామీతో అప్పులు చేసి బేస్‌మెంట్ పూర్తి చేసిన వందకు పైగా లబ్ధిదారులకు, నిబంధనల సాకుతో బిల్లులు అందడం లేదు. అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నామని, తనిఖీలు చేసి నిధులు విడుదల చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
ఖమ్మం: మినరల్ వాటర్ పేరిట.. రోగాల విక్రయం!

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఐఎస్‌ఐ మార్క్, ల్యాబ్ సౌకర్యం లేకుండానే బోరు నీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఒక లీటర్ నీటి కోసం మరో లీటర్ వృధా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాణ్యత లేని నీటితో రోగాల బారిన పడుతున్నామని, అధికారులు కల్తీ నీటి ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


