News March 11, 2025
సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీ

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులు జారీచేశారు. రాయపోల్ తహశీల్దార్ జీ. దివ్యను కొమురవెల్లికి, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓ ఐ. శ్రీనివాస్‌ను రాయపోల్ తహసీల్దార్‌గా, జగదేవపూర్ తహశీల్దార్ ఎం. కృష్ణమోహన్‌ను సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓగా బదిలీ చేశారు. జగదేవపూర్ డీటీ రఘువీర్ రెడ్డికి జగదేవపూర్ తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు.
Similar News
News July 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.
News July 7, 2025
రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.
News July 7, 2025
ముల్డర్ సరికొత్త చరిత్ర

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.