News March 11, 2025
నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారు: RS.ప్రవీణ్

TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS నేత RS.ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. అణచివేతకు గురైన వర్గాల విముక్తికి BRS సరైన వేదిక అని నమ్మి ముందుకు వెళ్తున్నా. BRS మళ్లీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 3, 2025
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.
News November 3, 2025
డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?


